వార్డుల పునర్విభజన నిష్పక్షపాతంగా జరగాలి: జిల్లా కలెక్టర్ గారికి వైఎస్సార్‌సీపీ నేతల వినతి

 


అమలాపురం మున్సిపల్ వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా జరగాలని కోరుతూ మాజీ మంత్రి, పీఏసీ మెంబర్ మరియు అమలాపురం పార్లమెంట్ కో-ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ గారు,జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు,అమలాపురం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ గారు,రామచంద్రాపురం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ గారు ఇతర ముఖ్య నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు.వార్డుల పునర్విభజన చట్ట ప్రకారం జరగడం లేదని, నిబంధనలను పక్కన పెట్టి కూటమి నాయకుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని నేతలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారురాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజల సౌకర్యార్థం నిష్పక్షపాతంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సంసాని నాని గారు,రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు గారు,మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్యనగేంద్రమణి గారు,జెడ్పీటీసీ పందిరి శ్రీహరి గారు,అమలాపురం పరిశీలకులు కటకంశెట్టి ఆదిత్య గారు,నాయకులు తదితరులు పాల్గొన్నారు