ఎమ్మెల్యే వేగుళ్ళ ను కలిసిన హౌసింగ్ పి.డి...


తూర్పుగోదావరి జిల్లా హౌసింగ్ పి.డి. నాతి బుజ్జి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్ కుమార్ లు శనివారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్కను జ్ఞాపికగా అందజేశారు. అనంతరం, మండపేట నియోజకవర్గానికి సంబంధించి పలు హౌసింగ్ విషయాలపై వేగుళ్ళ తో చర్చించారు. ఈ కార్యక్రమంలో  హౌసింగ్ డి.ఇ., మూడు మండలాల ఏ.ఇ.లు, తదితర్లు పాల్గొన్నారు.