వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత లేకుండా చూడండి అధికారులను కోరిన ఎమ్మెల్యే బండారు

      డీజిల్ కొరత వరి కోత యంత్రాలకు లేకుండా చూడాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులను కోరారు. నియోజవర్గం పరిధిలో ఆలమూరు, కొత్తపేట, రావులపాలెం,ఆత్రేయపురం మండలాల్లో వరి కోతులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కొరత పేరుతో వరి కోత యంత్రాలకు అంతరాయం కలుగుతుందని వరి రైతులు ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శుక్రవారం జిల్లా కలెక్టర్, జిల్లా సివిల్ సప్లై అధికారులతో పాటు నాలుగు మండలాల తాసిల్దారులకు ఫోన్ చేసారు.సంబంధిత బంకుల ద్వారా ఆ వరి కోత యంత్రాలకు అవసరమైన డీజీల్‌ను అందించాలని సూచించారు.అవసరమైతే క్షేత్రస్థాయిలో అంటే సంబంధిత  విఆర్ఓ లను బంకుల వద్ద పరివేక్షణకు పెట్టి రైతులకు ప్రస్తుత ఎంతో అవసరమైన ఈ డీజిల్ సరఫరా చేయాలని సూచించారు.