మండపేట : మండపేట మండలం ఆర్తమూరు గ్రామానికి చెందిన చిర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ సోమవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆయన కుమార్డు చిర్ల జయరామిరెడ్డి, సోదరి గ్రామ మాజీ సర్పంచ్ గొలుగూరి అన్నపూర్ణ లను పరామర్శించారు. మాజీ ఎంపీ అనురాధ వెంట మండపేట పుర పాలక సంఘం మాజీ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, చిర్ల రామచంద్ర రెడ్డి, గొలుగూరి అన్నపూర్ణ, విజయ భాస్కర్ రెడ్డి, గొలుకూరి సందీప్ రెడ్డి, నల్లమిల్లి రామచంద్ర రెడ్డి, నందికుళ్ళ ప్రసాద్, కర్రి భూన శేఖర్ రెడ్డి, గుమ్మడి అనిల్ కుమార్, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా, కర్రి జంబయ్య,సాధనాల శివ భగవాన్, పెచ్చెట్టి వెంకటేశ్వరరావు, మండ నాగిరెడ్డి ఉన్నారు.