షెడ్యూల్ కులాల హక్కుల కోసం అవిశ్రాంతంగా శ్రమించిన కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం ఎస్సీ సెల్ అధ్యక్షులు కోనాల అంబేద్కర్ మృతి పార్టీకి తీరని లోటని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కోనాల అంబేద్కర్ మృతి చెందడంతో ఎమ్మెల్యే బండారు రావులపాలెం లోని ఆయన స్వగృహం వద్ద కోనాల అంబేద్కర్ పార్థివదేహంపై పార్టీ జెండాను కప్పి, పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కోనాల ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన మృతితో బలమైన నాయకుడ్ని పార్టీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.