రాయవరం మండలం, పసలపూడి గ్రామం వైసీపీ కి చెందిన మాజీ ఎంపిటీసీ కటకం మాణిక్యం, నల్లమిల్లి వీర్రెడ్డి, నల్లమిల్లి అప్పారెడ్డి లు ఆ గ్రామ టీడీపీ నాయకుడు కర్రి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమక్షంలో వైసీపీ ని వీడి తెలుగుదేశంపార్టీ లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే వేగుళ్ళ టీడీపీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంధర్బంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, రామచంద్రాపురం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, సత్తి వెంకట కృష్ణారెడ్డి, మల్లిడి సూరెడ్డి, నల్లమిల్లి సతీష్ రెడ్డి, నల్లమిల్లి వెంకన్నబాబు, కొవ్వూరి వేణుగోపాల్ రెడ్డి, అనుసూరి శ్రీనివాసరావు, పడాల సత్యనారాయణ రెడ్డి, బుంగ పెద్ద, కొల్లి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు...