వైభవోపేతంగా చిల్లంగి శివాలయం లో నందీశ్వర అభిషేకం


కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెలిసిఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో నందీశ్వరునికి ఈరోజు త్రయోదశి పర్వదినం సందర్భంగా ప్రదోషకాలంలో నందీశ్వరునికి విశేష పంచామృత అభిషేకం భక్తులు చే ఆలయ ప్రధాన అర్చకులు వెంకట శాస్త్రి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా వైభవంగా జరిగినది .ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ అభిషేకం వల్ల వివాహం కాని వారికి వివాహం, వృతి, వ్యాపార సమస్యలు జాతకం లో ఉన్న దోషాలు తొలుగుతాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.