ప్రత్తిపాడు నియోజికవర్గం రౌతులపూడి మండల మేరకచామవరం శృంగవరం మధ్య ఉన్న నందనవనం లో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ ఉమా వర్ధిని నాగ లింగేశ్వర స్వామి దేవస్థానం నందు 2 వ సోమవారం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు ఆలయ అర్చకులు ఆకొండి మూర్తి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శరభవరం రాజరాజేశ్వరి పీఠం రామడుగుల మంజునాథ శర్మ చేతుల మీదుగా అలంకరించిన పరమశివుని దర్శనం చేసుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామి ను దర్శించుకుని అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరానికి చెందిన కొండమూరి సూర్య చంద్ర రావు ,సత్యవతి దంపతుల చేతుల మీదుగా అందచేసిన 20000 రూపాయలు,200 లీటర్ల పెరుగు తో ఏర్పాటు చేసిన అన్న సమరాధన లో సుమారు 3000 కు పైగా భక్త జనం ప్రసాద స్వీకరణ చేశారు.అనంతరం త్రయోదశి సందర్భంగా సాయంత్రం నందీశ్వరునికి పంచామృత ,ఫల రస అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనట్టు ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి శర్మ తెలిపారు.

