రెవెన్యూ అధికారులను వేడుకుంటున్న పోలిశెట్టి వెంకటేశ్వరరావు
ముమ్మిడివరం జూన్ 13: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లా ముమ్మిడివరం మండలం పల్లవారిపాలెం గ్రామానికి చెందిన పోలిశెట్టి వెంకటేశ్వరరావు భూమిని మాకు ఇప్పించండి మహా ప్రభో అంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న వైనం. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. అనకాపల్లి జిల్లా ,కసింకోట మండలం ఉగ్గిన పాలెం గ్రామ శివారు బుచ్చియ్యపేట వద్ద సర్వే నెంబర్ 222/2 లో రెండు ఎకరాల 86 సెంట్లు పోలిశెట్టి వెంకటేశ్వరరావు మరో 18 మంది కలిసి అక్టోబర్ 28 ,2016న రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఆ భూమికి సంబంధించి కొంతమంది భూహక్కుదారులు పాస్ బుక్కులు తీసుకోగా, కొంతమంది ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలలో పాసుబుక్కులు తీసుకోలేదని తెలిపారు. అనంతరం పాసుబుక్కులు కావాలని స్పందన కార్యక్రమంలో అనేకసార్లు అర్జీ పెట్టుకున్నట్లు తెలిపారు. పాసుబుక్కులు రాకపోవడంతో కోర్టును ఆశ్రయించి సర్వే చేయించాలని హైకోర్టుకు వెళ్ళినట్లు తెలిపారు. హైకోర్టు వారు సర్వే చేయమని కోర్ట్ ఆర్డర్ పంపడంతో, ఆ కాఫీ ని అక్కడ తాసిల్దార్ కి పంపగా, తాసిల్దార్ సర్వే చేయలేమని, సెప్టెంబర్ 9 ,2024న సబ్ డివిజన్ కాలేదని, జిల్లా సర్వేయర్ కి పెట్టుకోమని, ఎండార్స్మెంట్ కాపీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీసు లో అనేకమార్లు విషయం తెలియజేసి,3 సంవత్సరాలు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు తెలియకుండా ఆర్డీవో, తహసిల్దార్ ఆధ్వర్యంలో సర్వే చేసినట్లు, సర్వే నెంబర్ 222/2 లో రెండు ఎకరాల 86 సెంట్లు భూమిలో ఎకరం 40 సెంట్లు మాత్రమే భూమి ఉన్నట్లు రిపోర్టు రాసినట్లు తెలిపారు.
అయితే 222/2 సర్వే నెంబరు లో రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత 1 బి పాస్ బుక్ మీద ఫోర్జరీ రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలిపారు., లక్కీ రాజు చిరంజీవి తండ్రి మాణిక్యం పేరున ,పందిరి రఘురాం తండ్రి సూర్యనారాయణ పేరు మీద ఫోర్జరీ రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ సంబంధించిన దస్తావేజులు, తహసిల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ కాఫీ, ఆర్డీవో ఇచ్చిన ఎండార్స్మెంట్ కాఫీలు, సర్వేయర్ ఇచ్చిన ఎండార్స్మెంట్ కాపీలు, జతపరచి ఇచ్చినప్పటికి సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
కావున ఫోర్జరీ రిజిస్ట్రేషన్ మీద న్యాయ విచారణ చేసి తమ భూమి తమకు ఇప్పించవలసిందిగా పోలిశెట్టి వెంకటేశ్వరరావు మరో 18 మంది పత్రికా ప్రకటన ద్వారా కోరుచున్నారు.
