పసికందు మరణం పై ఈ ధర్మ రక్షకులైన మీరు ఏమన్నా స్పందించరా..!

 


ఓ సనాతన హిందూ ధర్మ పరిరక్షకుల్లారా, నిత్యం దేశం కోసం, ధర్మం కోసం video లు చేసే వీర ఝాన్సీ రాణుల్లారా.. ఒక హిందూ

నాగర్ కర్నూల్ జిల్లాలోని, కుమ్మెర గ్రామం గుడిలో జరిగిన కుల వివక్ష ఘటన పై పోరాటం చెయ్యరా?? 

ధర్మాన్ని రక్షిస్తున్నాం, మతం రక్షిస్తున్నాం అని బిక్షాటన చేసే మీరు కులం కాటుకు బలైన ఓ హిందూ పసికందు తల్లికి న్యాయం చేయాలని ఒక్క వీడియో అయినా చేశారా?? 

ఆడవారే కదా ఒక తల్లి క్షోభ అర్థం చేసుకోలేరా?? 

బిడ్డను కోల్పోయిన హిందూ BC (రజక ) కుటుంబం కంటే.. ఆ చావుకి, ఆ వివక్ష కి కారణం అయిన పెత్తందారి కులస్థులైన నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేయరా...!..*నాగర్ కర్నూల్ లో రజక కులానికి చెందిన బీసీ మహిళను గుడి లోపలకి వెళ్ళింది అనే కక్షతో ఆమెని కొట్టి ఆమె బిడ్డను రెండు నెలల పసికందును అన్యాయంగా చంపివేసిన కుల రాక్షసులను వెంటనే శిక్షించాలని కోరుతూజరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను దేవుని పేరుతో కులమతాల తేడాతో ఇంత దుర్మార్గానికి పాల్పడివారు ఎంతటి వారైనా సరే వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను దీనిపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు తీన్మార్ మల్లన్న గారు ఇంకా అనేకమంది బీసీ సోదరులు పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి వారికి న్యాయం జరిగేంత వరకు మేమంతా కూడా మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాను ఇట్లురాష్ట్ర బీసీ జనగణ సాధన పోరాట సమితి అధ్యక్షులు లుక్కా వెంకట శ్రీనివాసరావు