2027 పుష్కరాల అభివృద్ధి పనులకు, నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సీఎం పేషీలో శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కల్సుకున్నారు. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని దేవాదాయశాఖ నుంచి దేవాలయాల అభివృద్ధికి, పుష్కరఘాట్ల అభివృద్ధికి, ఆర్అండ్ బి శాఖ నుంచి రహదారుల అభివృద్ధికి, పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రామీణ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. జలవనరులశాఖ నుంచి పుష్కర ఘాట్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని విన్నవించారు. అలాగే కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే బండారు తెలిపారు.
