తుఫాన్ ను లెక్క చేయని శివ భక్తులు

ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల శృంగవరం నందనవనం లో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ ఉమా వర్ధిని నాగ లింగేశ్వర స్వామి దేవస్థానం లో కార్తిక సోమవారం సందర్భంగా తెల్లవారుజాము 3 గంటల నుండి ఆలయ అర్చకులు ఆకొండి మూర్తి శర్మ, శరభవరం శ్రీ రాజరాజేశ్వరి పీఠం అధిపతి మంజునాథ ఆధ్వర్యంలో పరమేశ్వరునికి అభిషేకాలు ఉదయం 10 గంటల వరకు నిర్వహించారు. తదుపరి స్వామి వారికి సుమారు 50 కేజీ ల భస్మం తో అభిషేకం నిర్వహించి భస్మ రూప లింగేశ్వరుడుగా స్వామి వారు దర్శన భాగ్యం కల్పించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో చుట్టు పక్క గ్రామాల భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి సేవలో తరించారు.