అమలాపురం విద్యా రంగానికి అపూర్వ గౌరవాన్ని రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా సేవలందిస్తున్న డాక్టర్ యెనుముల విశ్వ కనకం. ఆసియా ఖండ స్థాయిలో విశిష్టమైన సేవలందిస్తున్న ప్రతిభావంతులను ఎంపిక చేసి గౌరవించే “ఆసియన్ అడ్మైరబుల్ అచీవర్స్ – 2025” పుస్తకంలో ఆయనకు స్థానం దక్కడం విశేషం. ఈ విజయంతో అమలాపురం పేరు ఆసియా స్థాయిలో ప్రతిధ్వనించింది.ఆసియా ఖండంలోని జపాన్, కొరియా, చైనా, సౌదీ అరేబియా, కువైట్ తదితర దేశాల ప్రముఖులతోపాటు డాక్టర్ విశ్వ కనకం ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం గర్వకారణం. నిస్వార్థ పూర్వకంగా సమాజానికి, విద్యారంగానికి అంకితభావంతో పనిచేస్తున్న వారిని గుర్తించి ఆసియన్ అచీవర్స్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.డాక్టర్ విశ్వ కనకం గత 33 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఎన్నో తరాల విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. ఆయన శిష్యులు దేశవ్యాప్తంగా డాక్టర్లు గా, లెక్చరర్లు గా, ఉపాధ్యాయులు గా, ప్రిన్సిపాల్స్ గా, వివిధ రంగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడి సమాజానికి సేవలందిస్తున్నారు. ఆయన విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో చూపిన కృషి అందరినీ ఆకట్టుకుంటోంది.
2016లో నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పీహెచ్.డి పొందిన ఆయనకు 2022లో గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా లభించింది. అదే సంవత్సరం మదర్ థెరిసా గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. విద్యార్థుల అభ్యున్నతికి చేసిన కృషి కారణంగా ఇప్పటికే పలు అవార్డులు, ప్రశంసలు ఆయనను వరించాయి.ఇప్పుడు ఆసియా స్థాయి గుర్తింపు డాక్టర్ విశ్వ కనకం వ్యక్తిగత ప్రతిభకు మాత్రమే కాకుండా అమలాపురం విద్యా రంగానికి గౌరవాన్ని తెచ్చిందని స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “ *విశ్వకనకం వంటి అంకితభావం కలిగిన అధ్యాపకులు మరింత ముందుకు వస్తేనే విద్యా రంగం అభివృద్ధి చెందుతుందని* ” ఈ సందర్భంగా రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.వి.సూర్యనారాయణ రెడ్డి అన్నారు.అనంతరం విశ్వకనకం సహా అధ్యాపకులు, కళాశాల ప్రిన్సిపాల్ సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.తమను ఇటువంటి స్థానంలో ఉంచిన ఉపాధ్యుడుకి శిష్యులు కృతజ్ఞతలు తెలిపారు.