ఉపాద్యాయుల్ని పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పుకొనివ్వడి మహా ప్రభో...STU శేఖర్

 



రావులపాలెం:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, రావులపాలెం మండల పొడగట్లపల్లి గ్రామంలో ఎస్ టి యు సభ్యత్వ నమోదు క్యాంపన్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఎస్టియు శేఖర్ మాట్లాడుతూ పాఠాలు చెప్పడానికి నియమించబడ్డ ఉపాద్యాయులు ప్రశాంతంగా విద్యార్థులకు పాఠాలు చెప్పే వాతావరణం కల్పించాలని అధికారులను కోరుచున్నాం అని అన్నారు, ఎస్టీయు సభ్యత్వం నమోదు కేంపైన్ లో భాగంగా రావులపాలెం మండలం అన్ని హై స్కూల్స్  పర్యటించారు, దేవరపల్లి హై స్కూల్ లో ఉపాద్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ అనేక రకాల విద్యేతర కార్యక్రమలతో విద్యార్థులకు పాఠాలు చెప్పే పరిస్థితులు లేవన్నారు, దయచేసి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలో చదవే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు కొరకు మనసు పెట్టి ఆలోచించి అస్సెస్మెంట్ టెస్ట్,వర్క్ బుక్, హ్యాండ్ బుక్,వివిధ రకాల అప్ లు,విద్యాశక్తి, స్వచ్ఛ పక్వాడ్ వంటి కార్యక్రమాలు నిర్వహణ నుండి ఉపాద్యాయులను తప్పించి భోధనకు మాత్రమే పరిమితం చేయాలని కోరి ప్రార్థన చేస్తున్నాం మహా ప్రభు అన్నారు

   అలాగే ఉపాద్యాయులు DA లు,PRC అరియర్స్, సంపాదిత సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి ఆర్థిక బకాయిలు కుప్పలుతెప్పలుగా పెరుకుపోయాయి తక్షణమే చెల్లించండానికి చర్యలు తీసుకోకపోతే Fapto ఆధ్వర్యంలో అక్టోబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు... ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యంగారు,మండలం అధ్యక్షుడు కె.కింగ్, ప్రధాన కార్యదర్శి A శ్రీనివాస్, పేచీటి శ్రీనివాస్, ఇమ్మనేయులు,శ్రీ రామ్,ch నాగేశ్వరరావు, కె.నారాయణ జి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు