రావులపాడు నుండి వాడపల్లి నడిచి వెళ్ళే ప్రజలకు ఇబ్బందులు

 

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజికవర్గ రావులపాలెం మండల రావులపాడు నుండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి తరచూ అధిక సంఖ్యలో భక్తులు నడక మార్గంలో వెళ్ళే రహదారికి భద్రత లోటు.ఆ రోడ్డులో కొంతమంది వ్యక్తులు ఆ మార్గంలో వెళ్ళే తమ వాహనాలను రోడ్లపై ఆపి మద్యం సేవించడం గుట్కా వంటివి రోడ్డుపై ఉమ్మడం భక్తులు నడిచి వెళ్లడానికి పలు ఇబ్బందులకు గురి అవుతున్నారు పరిసర ప్రాంతాల నుండి దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు అక్కడ వాడపల్లి 9 కిలోమీటర్లు అనే బోర్డు చూసి నడక మార్గంలో వెళ్తూ మార్గ మద్యలో ఎన్నో ఇబ్బందులు గురి అవుతున్నారు. ఈ మార్గం లో కాలువ గట్టు కి ఆనుకున్న ఉన్న ఇళ్లకు అనుమతులు ఉన్నాయా ? అసలు ఇక్కడ నివసించే వారు స్థానిక ప్రాంతానికి చెందిన వారే నా అని పలువురు విమర్శిస్తున్నారు.ఇప్పటికయినా ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ని దర్శించుకోవడానికి ఈ మార్గంలో వెళ్ళే భక్తులు తమకు ఈ సమస్యలు కలగకుండా సంబంధిత అధికారులు పట్టించు కోవాలి అని కోరుతున్నారు.