అమలాపురం. డిసెంబర్ 31: పట్టణంలో న్యూ కోనసీమ ప్రెస్ క్లబ్ సమావేశం రిపోర్టర్ నాగ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా న్యూ ప్రెస్ క్లబ్ ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో సుమారు 25 మంది వివిధ పత్రికలు న్యూస్ ఛానల్ సంబంధించి సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షులు రిపోర్టర్ నాగ శ్రీనివాస్ మాట్లాడుతూ న్యూ ప్రెస్ క్లబ్ ఏర్పాటు శుభ పరిణామం అని, ప్రెస్ క్లబ్ లో డిగ్రీ చదువుకున్న యువకులు, లాయర్ చదువు పూర్తిచేసిన మేధావులు, సీనియర్ పాత్రికేయులు, విధ్వాoసులు పాల్గొనడం మరింత శుభ పరిణామమని అని అన్నారు. పార్టీలు, కుల,మతాలు, వర్గ వైశ్యామ్యాలకు అతీతంగా వార్తలు ఉన్నది ఉన్నట్టుగా వ్రాయాలని సూచించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా పల్లి జ్యోతి స్టాప్ రిపోర్టర్ బి ఏ జె డబ్ల్యూ రెడ్డి బాబు, సిటిజన్ టైమ్స్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ పెంట నాగ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా క్లూస్ టీవీ స్టేట్ ఇంచార్జ్ పలివెల రాజు, ప్రధాన కార్యదర్శిగా నిఘా సూర్య ఎడిటర్ సూరపురెడ్డి శ్రీరామ్మూర్తి, జాయింట్ సెక్రటరీగా అయినవిల్లి విజయబాబు పశ్చిమ వాహిని సబ్ ఎడిటర్,ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రభ స్టాప్ రిపోర్టర్ సత్తి శ్రీరామ వర ప్రసాద్, ట్రెజరర్ గా పెన్ పవర్ రూరల్ రిపోర్టర్ గోకరకొండ పద్మనాభ రాజు, ఎగ్జిక్యూటివ్స్ మెంబర్స్ గా వైజాగ్ ఎక్స్ప్రెస్ జిల్లా ఇన్చార్జ్ సత్యనారాయణ, నవభూమి స్టాప్ రిపోర్టర్ బోయి రాంబాబు, దళిత వాయిస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉందుర్తి సురేష్, ఇండియన్ ఎక్స్ప్రెస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ త్రిమూర్తులు శ్రీ కోటి, ప్రజాకాంక్ష స్టాప్ రిపోర్టర్ గోపిశెట్టి రామచంద్రుడు, కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తాతపూడి నరేష్ కుమార్, గుర్రం రాంబాబు, ఆకొండి మూర్తి ,కేత శ్రీనివాస్ గోపుచెట్టి రామచంద్రుడు, తదితర సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
