అమలాపురం మే 1: యు వతకు క్రీడాకారులకు క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా, క్రమశిక్షణ, ఏకాగ్రతకు నిలువుటదాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొ న్నారు ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయ అనుబంధ కళాశా లగా ఉన్న కామన గరుగు చల్లపల్లి రోడ్ లో ఉన్న 'ది అమలా పురం కాలేజీ 'నందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆదేశాల మేరకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వ ర్యంలో సాయి విలువిద్య సంస్థ వారి ద్వారా విలు విద్య సమ్మర్ కోచింగ్ క్యాంపు 2026 ను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ శుక్రవారం ప్రారం భించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ విలువిద్యలో నవశ కాన్ని తీసుకొచ్చే దిశగా శాప్ క్రీడల వేదికగా సరికొత్త అడుగు పడిందన్నారు క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శాప్ ద్వారా క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీ సేందుకు 'నవశకం' పేరుతో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిం దన్నారు.ముఖ్యంగా మన సంస్కృ తిలో భాగమైన విలువిద్య (ఆచరి) క్రీడలో మన జిల్లా యువతకు అపారమైన ప్రతిభ ఉందని. ఈ ప్రతి భను అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే ఈ క్రీడల పోటీల ప్రధాన లక్ష్యమన్నారు.తద్వా రా గ్రామీణ ప్రతిభకు గుర్తింపు లభిస్తుందన్నారు మారు మూల ప్రాంతాల్లో ఉన్న సహజ సిద్ధ మైన విలువిద్య క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన వేదికను కల్పించడం జరిగిందన్నారు
శాప్ ఆధ్వర్యంలో అత్యాధునిక విల్లులు మరియు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణను అందిం చడం ద్వారా క్రీడాకారు లను అన్ని విధాల ప్రోత్స హిం చడం జరుగుతోoద న్నారు.మౌలిక సదుపా యాల కల్పన ద్వారా, జిల్లాలో ప్రత్యేక విలు విద్య శిక్షణ కేంద్రాలను బలోపే తం చేయాలన్నారు.ఏకా గ్రత సాధన ఈ క్రీడకు అత్యంత అవసరమన్నారు విలువిద్య అనేది కేవలం గురి పెట్టడం మాత్రమే కాదని మనస్సును అదుపులో ఉంచుకునే కళ అన్నారు. విద్యార్థుల్లో ఏకా గ్రతను పెంచి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ సిబ్బంది పాటుపడా లన్నారు గురి చూసి బాణాన్ని వదిలి నట్లుగా యువత జీవిత ఆశయాల పట్ల స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగాలన్నారు.విలువిద్య లో నైపుణ్యం సాధించి, కోనసీమ జిల్లా కీర్తిని రాష్ట్ర మరియు జాతీయ స్థాయి లో ఇను మడింప జేయాలని ఆకాం క్షించారు క్రీడా కారులకు అవసరమైన అన్ని వసతులను కల్పిం చేందుకు జిల్లా యంత్రాం గం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉం టుందన్నారు. యువత పేడ స్ఫూర్తితో ముందుకు సాగుతూ విజయపథంలో పయనించా లన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్డివో రుద్ర, విలువిద్య అధ్యక్షులు గోపాలకృష్ణ, కోచ్ డి సాయి బాబా స్థానిక తాసిల్దార్ దివాకర్ తదితరులు పాల్గొ న్నారు