ఈవోగా సత్యనారాయణ రాజు బాధ్యతలు
అయినవిల్లి :
శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఈవోగా ముదునూరి సత్యనారాయణ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈవోగా పని చేస్తూ ఆయన మూడు నెలల క్రితం వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లారు. ఆయన స్థానంలో ఇంత వరకు జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి. గంగాభవానీ ఈవోగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్థానంలో అయినవిల్లి ఈవోగా సత్యనారాయణ రాజు బాధ్యతలు స్వీకరించి శనివారం స్వామివారిని దర్శించుకున్నారు.