శ్రీ ఉమా వర్ధిని నాగలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మాసశివరాత్రి ఆరుద్ర నక్షత్ర ఏకాదశ రుద్రాభిషేకం


కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం శృంగవరం నందనవనం లో వేంచేసి ఉన్న శ్రీ ఉమా వర్ధిని నాగలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం నుండి భక్తులు స్వామి వారి అభిషేక కార్యక్రమం లో పాల్గొన్నారు సుమారు 100 సంవత్సరాల కు కానీ బహుళ చతుర్దశి ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి రావు కనుక ఈ రోజు ఆలయం లో ప్రధాన అర్చకులు ఆకొండి మూర్తి శర్మ , వేద పండితులు రామడుగుల మంజునాథ శర్మ , వెలువలపల్లి దక్షిణా మూర్తి శర్మ, అన్నవరం వేద పాఠశాల ఉపాధ్యాయులు ఆరాధ్యుల లక్ష్మీ నరసింహ మూర్తి శర్మ ,చిల్లంగి శివాలయం అర్చకులు ఆకొండి వెంకటశాస్త్రి శర్మ ,శృంగవరం గ్రామ పౌర్హిత్యులు ఆనివేళ్ళ సత్యనారాయణ మూర్తి ల ఆధ్వర్యంలో ప్రత్తిపాడు మాజీ శాసనసభ్యులు శ్రీ పూర్ణచంద్ర వరప్రసాద్ సతీమణి సత్యవేణి,శ్రీ వల్లి ఉమెన్స్ బట్టల షాప్ యజమానులు నాని బాబు ,దివ్య దంపతులు,కాకినాడ వాస్తవ్యులు ఓలేటి సాయి కామేష్ , శేష సంతోషి సత్యవతి దంపతులు చేతుల మీదుగా అత్యంత వైభవోపేతం గా మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ,గ్రామ అభివృధి కోసం రుద్ర సహిత,మృత్యుంజయ సహిత చండీ బీజాక్షర సహిత హోమం ,అన్నాభిషేకం, అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల, ఆలయకమిటి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ వాస్తవ్యులు ఓలేటి సాయి కామేష్ దంపతులు తన సతీమణి శేష సంతోషి సత్యవతి జన్మదిన సందర్భంగా ఆలయంలో మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.