పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాన్
*గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్*
*ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230కి.మీ, కాకినాడకి 310కి.మీ విశాఖపట్నంకి 370కి.మీ,దూరంలో కేంద్రీకృతం*
*మరికాసేపట్లో తీవ్రతుపానుగా బలపడే అవకాశం*
*రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం*
రేపు కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు
95 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు రికార్డు
ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి
~ ప్రఖర్ జైన్,ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.
