
ఏపీ రాష్ట్ర ఏఎంసీ ఔట్సోర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం._ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల ఔట్సోర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షులు కూనపరెడ్డి సుధాకర్ రాజు పిలుపు మేరకు మన చేతుల్లో మన భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని కోనసీమ జిల్లా రావులపాలెం మార్కెట్ యార్డ్ నందు ఇక్కడ అందరూ నాయకులే అనే నినాదంతో ఎనిమిది జిల‌్లాలు నాయకులు,సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలవారీగా సభ్యులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యాలయాల్లోను,చెక్ పోస్టుల నందు విధులు నిర్వహిస్తూ చాలీ చాలని జీతాలతో జీవితాలు నెట్టుకోస్తున్నామని, ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చేడంలో ముఖ్య భూమిక పాత్ర పోషిస్తూ అనేక సేవలందిస్తున్నా కాని ఏ ప్రభుత్వాలు వచ్చిన మా పై ఏవిధమైన దయదక్షనలు చూపడం లేదని డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వాలు కానీ మా జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపలేదని వారు భావోద్వేగాలకు లోనైయ్యారు.త్వరలో మా భవిష్యత్ కార్యాచరణ కోసం రాష్ట్ర కార్యవర్గం ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అయిన కూనపరెడ్డి సుధాకర్ రాజు మాట్లాడుతూ ఈ సమస్యలపైన త్వరలో నే రాష్ట్ర కార్యవర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసారు. ఈ విషయం పై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తెలపాలని సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఈవోలు, యార్డ్ అసిస్టెంట్లు, అటేండర్ వాచ్మెన్లు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.