డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అవమానించిన వారిని అరెస్టు చెయ్యాలి

నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నందు తెలంగాణ ఉద్యమకారుల ముసుగులో కొంతమంది మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ప్రొఫెసర్ నాగేశ్వర్ మద్దతుదారులుగా, తెలంగాణా ఉద్యమకారులుగా ప్రాంతీయ విద్వేషాలు రేపేలా వాఖ్యలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి తీవ్ర అవమానం చేశారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ అమలాపురం జనసేన పార్టీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. అవమానించి, ప్రాంతీయ విద్వేషాలు లేపిన వారిని తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో రాష్ట్ర హ్యాండీ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్డీఎస్ ప్రసాద్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ యాళ్ళ నాగ సతీష్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కల్వకొలను తాతాజీ, మాజీ కౌన్సిలర్ యేడిద శ్రీను, సుధా చిన్న, గండి స్వామి, డి ఎస్ ఎన్ కుమార్, మోటూరి సూర్య కిరణ్ మరియు జనసేన పార్టీ నాయకులు.