ఫీజులు చెల్లించలేదని హాల్ టికెట్లు ఆపితే కఠిన చర్యలు

 

ఫీజులు చెల్లించలేదని  హాల్ టికెట్లు ఆపితే కఠిన చర్యలఈనెల 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు*   

పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక  శుక్లా.     ఇంటర్మీడియట్ ప్రీ-పబ్లిక్ పరీక్షల ఫలితాలు   

ఈ నెల ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ పైన సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా    సమావేశ ముఖ్యాంశాలు:  

 ఫలితాల సమీక్ష: ఇటీవల ముగిసిన ప్రీ-పబ్లిక్ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల పనితీరును కలెక్టర్  విశ్లేషించారు. 

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తగు సూచనలు చేస్తూ, అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. 

పరీక్షల సన్నద్ధత: ఈ నెల ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల పకడ్బందీ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

విద్యార్థులు , తల్లిదండ్రులకు సూచనలు:హాల్ టికెట్లు: పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.  

వాట్సాప్ సౌకర్యం: విద్యార్థులు తమ హాల్ టికెట్లను 9552300009 అనే మన మిత్ర వాట్సాప్ (MANA MITHRA WhatsApp) నంబర్ ద్వారా కూడా సులభంగా పొందవచ్చు. 

 ఫీజుల వేధింపులపై హెచ్చరిక: ఏ కళాశాల యాజమాన్యమైనా ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఆపినా లేదా విద్యార్థులను ఒత్తిడికి గురిచేసినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. 

ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు