కాశీ పీఠాధిపతులు శివ నాగేంద్ర సరస్వతి మండపేట రాక...





వారణాసి కి చెందిన ప్రముఖ కాశీ పీఠాధిపతులు శ్రీ శివ నాగేంద్ర సరస్వతి స్వామీజీ మార్చి 1 న మండపేట విచ్చేస్తున్నట్లు మండపేట 15 వ వార్డు కౌన్సిలర్ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. మార్చి 1 నుండి 5 వరకు మండపేట ధర్మ గుండం చెరువు వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి పీఠం ( తమ నివాసం ) వద్ద ఉంటారని తెలిపారు. 5 రోజులు పాటు స్వామి వారు మండపేట లోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. మార్చి 1 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కలువపువ్వు సెంటర్ నుండి ఊరేగింపుగా స్వామి వారిని పీఠానికి తీసుకు వెళతామని చెప్పారు. స్వామి వారు అమ్మ వారి మహానుగ్రహం కలిగిన మహోన్నతులని పేర్కొన్నారు. అమ్మ వారి భక్తులు, కుల మతాలకు అతీతంగా పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారి ఊరేగింపును విజయవంతం చేయాలని శ్రీనివాస్ కోరారు.