మై టీడీపీ యాప్ తో ప్రజలకు చేరువుగా ప్రభుత్వ పథకాలు.


 మై టీడీపీ యాప్ తో ప్రజలకు చేరువుగా ప్రభుత్వ పథకాలు.

(ఆలమూరు):

మై టీడీపీ యాప్ ద్వారా ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందని పలువురు మండల టీడీపీ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు ఈదల సత్తిబాబు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఆలమూరు పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ నాయకులు దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పౌర సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు మై టిడిపి యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి బూత్ కన్వీనర్ (లీడర్ టు కేడర్)వరకు ప్రతి సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చని క్యూఆర్ కోడ్ తో యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఈదల నల్లబాబు, రామానుజుల శేషగిరిరావు, పాలూరి గోవిందరాజు, చీపురుపల్లి గణేష్, లంక వినయ్,బోడపాటి మారుతి, వైట్ల అభి చౌదరి,చిన్న, తదితరులు పాల్గొన్నారు.