.పెదవడ్లపూడి హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్....






వేగుళ్ళ లీలాకృష్ణ చైర్మన్‌గా బాధ్యతల తరువాత తొలి ప్రాజెక్ట్ ప్రారంభం....మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ గారు పాల్గొన్నారు. ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రారంభమైన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా లీలాకృష్ణ గారు మాట్లాడుతూ ఈ హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాలకు చెందిన సుమారు 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా ఏర్పాట్లు చేయబడ్డాయని తెలిపారు. దీని ద్వారా ఆ ప్రాంత రైతులకు విశేష ప్రయోజనం కలగనుందని అన్నారు. ఎన్నికల సమయంలో మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రారంభించడం ద్వారా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ వ్యవసాయ అభివృద్ధికి, రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ఎంతో దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వేగుళ్ళ లీలాకృష్ణ చైర్మన్‌గా బాధ్యతల తరువాత తొలి ప్రాజెక్ట్ ప్రారంభం....


మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ గారు పాల్గొన్నారు. ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రారంభమైన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా లీలాకృష్ణ గారు మాట్లాడుతూ ఈ హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాలకు చెందిన సుమారు 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా ఏర్పాట్లు చేయబడ్డాయని తెలిపారు. దీని ద్వారా ఆ ప్రాంత రైతులకు విశేష ప్రయోజనం కలగనుందని అన్నారు. ఎన్నికల సమయంలో మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రారంభించడం ద్వారా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ వ్యవసాయ అభివృద్ధికి, రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ఎంతో దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.