గ్రామ శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించిన డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు*
డా బిఆర్ అంబేత్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం మండల కేంద్రం ఆలమూరులోని కండ్రిగ పేటలో వెలసి ఉన్న యానాదుల కులదేవత శ్రీ కోట సత్తెమ్మ తల్లి అమ్మవారి సంబరం వచ్చేనెల ఫిబ్రవరి 5వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు యానాదుల సంఘ సభ్యులు తెలిపారు. ఈ సంబరం అనంతరం ఫిబ్రవరి 6వ తేదీన భారీ అన్న సమారాధన కార్యక్రమము నిర్వహించనున్నారు.అమ్మవారి సంబరాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు ట్రెజరర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు యానాదుల సంఘానికి రూ.10,000 విరాళాన్ని అందజేశారు. బుధవారం ఆలమూరులోని తన స్వగృహంలో యానాదుల సంఘ సభ్యులకు ఈ విరాళాన్ని అందించడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మాట్లాడుతూ, భక్తులు కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి సంబరాలకు సహకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని ప్రత్యేకంగా అభినందించి, గ్రామ ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని, గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్ధించారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలమూరు గ్రామ మాజీ సర్పంచ్ గంధం బంగారుబాబు, యానాదుల సంఘం ప్రెసిడెంట్ ఆకుల యేసు రాజు, వైస్ ప్రెసిడెంట్ కొమ్మరగిరి సురేష్, ట్రెజరర్ రాచూరి మరిడియ్య, సంఘ సభ్యులు గంధం శివయ్య, మర్రి సత్యనారాయణ, మర్రి ముసలయ్య, మర్రి చిన్న, గొలుసుల శివయ్య, రాచూరి కృష్ణమూర్తి, మర్రి రామ తాతయ్య, గంధం జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
