రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోపోలీసుల అప్రమత్తత.బాధితులకు 11 మొబైళ్లు తిరిగి ఇచ్చారు.

ప్రజల ఆస్తి రక్షణలో పోలీసులు నిబద్ధతతో వ్యవహరించాల్సిన సేవా ధర్మాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గత కొంతకాలంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను శ్రమించి ట్రేస్‌ చేసిన పోలీసులు వాటిని అసలైన యజమానులకు తిరిగి అందించారు.మంగళవారం స్టేషన్‌ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో  సి ఐ శేఖర్‌బాబు రూ. 4 లక్షల 20 వేల విలువ గల 11 మొబైల్‌ ఫోన్లను వారి యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మొబైళ్లు దొరకడం ఊహించలేదని, పోలీసులు తనిఖీలు చేపట్టి తిరిగి అందజేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.సిఐ శేఖర్‌బాబు మాట్లాడుతూ ప్రజలు ఏ ప్రాంతంలో ఫోన్‌ తప్పిపోయినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. మొబైల్‌ ట్రేసింగ్‌ పద్ధతుల ద్వారా ఫోన్లను కనుగొనడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఫోన్‌ దొరికిన తర్వాత తప్పుడు ఉపయోగాలు, ఆర్థిక మోసాలు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తుచేసి, ఇలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.అక్రమ కార్యకలాపాలు, చోరీల నియంత్రణలో ప్రజలు సహకరిస్తే మరింత సమర్థవంతంగా పనిచేయగలమని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.అప్రమత్తత నిబద్ధత ప్రజాభద్రత రావులపాలెం పోలీసుల ఈ చర్య స్థానిక ప్రజల్లో ప్రశంసలు అందుకుంది.