కోనసీమ జిల్లా 22 మండలాలకు నియమించిన కలక్టర్ మహేష్ కుమార్ డిప్యూటీ ఎంపీడీవోలు నియామకం



   డాక్టర్ బీఅర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాలకు డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తూ గురువారం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో తీసుకొస్తున్న సంస్కరణలో భాగంగా సచివాలయ పరిపాలనకు సంబంధించి కొత్తగా డిప్యూటీ ఎంపీడీవో (జిఎస్‌డబ్ల్యూఎస్)లను నియమించారు. గ్రామపంచాయతీలో ఎలాంటి కేసులు లేని సీనియర్ గ్రేడ్-1 కార్యదర్శులను, మండల పరిషత్ లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ లకు పదోన్నతి ఇచ్చి డిప్యూటీ ఎంపిడివొలుగా అవకాశం ఇచ్చారు. ఈ 22 మందిలో మందిలో 13 మంది కోనసీమ జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు కాగా మరో ఆరుగురు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. అలాగే పశ్చిమగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లా నుంచి ఒక్కొక్కరు వచ్చారు. జోన్ 2 పరిధిలో ఉన్న ఈ 22 మందిని కోనసీమ జిల్లాకు కేటాయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.దీంతో వారికి జిల్లా కలెక్టర్ మండలాలలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

మండల వారీగా డిప్యూటీ ఎంపీడీవోలు వీరే 

1. అయినవిల్లి.. శెట్టిమల్లి రాజమోహన్ 

2.ఆలమూరు... చీమకుర్తి వీర్రాజు 

3.అల్లవరం... వై లక్ష్మీనారాయణ 

4.అమలాపురం.. జి రవి 

5.అంబాజీపేట.. అబ్బాస్ అలీ మహమ్మద్ 

6.ఆత్రేయపురం.. కె రమేష్ బాబు 

7.ఐ. పోలవరం.. వి రాజేష్ 

8.కె. గంగవరం.. కొత్తల సాంబమూర్తి 

9.కపిలేశ్వరపురం.. వెలిశెట్టి శ్రీరామ్మూర్తి

10.కాట్రేనికోన.. సరిపల్లి సూర్యనారాయణ రాజు 

11.కొత్తపేట.. గుడే నారాయణరావు 12.మలికిపురం.. చిటికెన సత్యనారాయణ 

13.మామిడికుదురు.. తిక్కిరెడ్డి శ్రీనివాస్ 

14.మండపేట.. శ్రీరాముల అనిల్ కుమార్ 

15.ముమ్మిడివరం.. బి సుజాత 

16.పి గంవరం.. ఆర్ సూర్యనారాయణ మూర్తి

17. రామచంద్రపురం.. పినిశెట్టి వీరభద్రరావు

18. రావులపాలెం..వెంటూరి అమరనాథ్ చౌదరి

19. రాయవరం.. వేగిశెట్టి కృష్ణంరాజు 

20.రాజోలు... పి సత్తిబాబు 

21.సఖినేటిపల్లి.. దీక్షితుల శ్రీనివాస్ 

22.ఉప్పలగుప్తం.. డి.కాంతారావు