కొత్తపేటసంక్షేమం–అభివృద్ధి సమతుల్యం: ఏపీ బడ్జెట్‌పై టీడీపీ సీనియర్ నాయకులు కంఠంశెట్టి శ్రీనివాస్ ప్రశంసలు
కొత్తపేట మండలం టీడీపీ సీనియర్ నాయకులు కంఠంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా ఉందన్నారు. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించిందని పేర్కొన్నారు.2026–27 రివైజ్డ్ అంచనాల్లో రూ.39,497.56 కోట్లుగా ఉన్న మూలధన వ్యయాన్ని ప్రస్తుత అంచనాల్లో రూ.14,417.82 కోట్లు పెంచి మొత్తం రూ.53,915.38 కోట్లకు చేర్చడం అభివృద్ధికి బలమైన సంకేతమన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూలధన వ్యయాన్ని నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం భారీ కేటాయింపులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించేలా చర్యలు చేపట్టిందన్నారు.రాష్ట్ర జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుకు రూ.6,105 కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు కేటాయించడం రైతులకు మేలు చేస్తుందని అన్నారు. పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.19,306 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.23,650 కోట్లు, జల వనరుల శాఖకు రూ.18,223 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.22,941 కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.14,538 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారుఅలాగే రూ.30 వేల కోట్లతో హార్టికల్చర్ క్లస్టర్లు, ఆర్థిక జోన్ల ఏర్పాటు ద్వారా పెట్టుబడులు ఆకర్షించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అమరావతి కేంద్రంగా 9 జిల్లాలతో ఆర్థిక ప్రాంతం, విశాఖపట్నం పరిధిలో 10 జిల్లాలతో ఆర్థిక ప్రాంతం ఏర్పాటు చేయడం సమతుల అభివృద్ధికి దోహదమని పేర్కొన్నారు. విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28 వేల కోట్లు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు రూ.30 వేల కోట్లు కేటాయించడం ప్రాంతీయాభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారుసంక్షేమ పథకాల కింద ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4 వేల కోట్లు, జల్ జీవన్ మిషన్కు రూ.4 వేల కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రూ.27,719 కోట్లు, హౌసింగ్‌కు రూ.5,451 కోట్లు, స్త్రీ శక్తి పథకానికి రూ.1,420 కోట్లు కేటాయించడం ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనడానికి నిదర్శనమన్నారు.
రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ.13,546 కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.3,161 కోట్లు, ఐటీ శాఖకు రూ.536 కోట్లు, హోం శాఖకు రూ.9,165 కోట్లు కేటాయించారని తెలిపారు. పోలీస్ శాఖకు 3 వేల కొత్త వాహనాలు సమకూర్చడం, 94 ఎకరాల్లో కొత్త ఏపీ పోలీస్ అకాడమీ ఏర్పాటు చేయడం భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారుగత ప్రభుత్వం రాష్ట్రానికి రూ.9 లక్షల 74 వేల కోట్ల అప్పు మిగిల్చిందని ఆరోపించిన ఆయన, అయినప్పటికీ అభివృద్ధి–సంక్షేమ సమతుల్యతతో ప్రస్తుత బడ్జెట్ రూపొందించబడిందన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని కంఠంశెట్టి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
.jpeg)