నారద ప్రతిష్టిత నవ జనార్ధన ఆలయాల్లో ప్రముఖమైన ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి వారి ఆలయాన్ని శనివారం మండల భాజపా అధ్యక్షులు సుంకర శ్రీరాములు దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బైరిశెట్టి రాంబాబు ఆయనకు సాదర స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం ఆయనను సత్కరించారు. 5వేల ఏళ్ల నాటి పురాతన ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని భాజపా నాయకుడు సుంకర శ్రీరాములు అన్నారు
