మామిడికుదురు అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ హరీష్ బాలయోగి…
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబ సభ్యులను అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడికుదురు గ్రామంలోని ఆల్ క్యాస్ట్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలుడు వలన సుమారు ఒక 12 కుటుంబాలు వాళ్ళ ఇల్లు కోల్పోయారని అప్పటికప్పుడే స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవడం జరిగిందన్నారు. దీని గురించి స్థానిక ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్ లతో మాట్లాడటం జరిగిందన్నారు. ఆయన కూడా వచ్చి స్థానికంగా ఉన్న సమస్యలు అన్నిటిని కూడా పరిశీలిస్తూ కుటుంబాలతోనే మాట్లాడి వాళ్ళని పూర్తిగా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటూ వాళ్ళందరినీ ఆదుకుంటామని కూడా చెప్పడం జరుగుతుందన్నారు. కొన్ని కుటుంబాలకు స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కుటుంబాలందరూ కూడా ఒకే చోట ఉంటారని చెప్పి కూడా వాళ్ళు మా అందరికీ కోరిక తెలియపరచడం వల్ల వీళ్ళందరినీ కూడా ఒకే చోట ఎక్కడ అవకాశం దొరుకుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నామన్నారు.అధికారులు బాధ్యత తీసుకుంటూ ఎక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉందో దాని ప్రకారం మీరందరికీ ఒకే చోట ఇప్పించే విధంగా కూడా ఏర్పాటు చేద్దామని కూడా వాళ్ళు తెలియజేశారు. నేనే స్వయంగా కూడా ఇల్లు పట్టాలు దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ కొంచెం అడిషనల్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి దాన్ని కూడా ఏ విధంగా మనం ఉపయోగించుకోగలుగుతాము అనేది కూడా నేను కూడా స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు ఈ నారా చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకుని కూడా తీసుకెళ్తూ దీన్ని ఏ విధంగా మనం చేయగలుగుతాము అనేది కూడా బాధ్యత నేను వహిస్తామని కూడా బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
అదే విధంగా వీళ్ళందరినీ ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరరీగా స్కూల్ బిల్డింగ్ లోనే వీళ్ళకి షెల్టర్స్ కేటాయిస్తున్నారు. దాంతో పాటు ప్రతి రోజు కూడా వీరికి కావలసిన భోజనం ఏర్పాటు అయినా సరే లేకపోతే నిత్యావసర వస్తువులైనా సరే మొత్తం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ అందరికీ కూడా వారికి కావలసిన నిత్యావసర వస్తువులు బట్టలైనా లేకపోతే భోజనం ఏర్పాటును కూడా వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని వారికి అందజేయడం జరుగుతుందన్నారు.
బాధ్యతగా వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి ఆదుకోవడం, అదే విధంగా బాధిత కుటుంబ సభ్యులు. కానీ వాళ్ళందరూ కూడా ఒకటే, వాళ్ళు అందరూ అడిగింది ఒకటే మాకు ఇందులో ఈ విధంగా మాకు కట్టించమని చెప్పి కూడా ఇక్కడ టెంపరరీ అకామడేషన్ చేయాలన్నారు. దానికి కూడా జనసేన పార్టీ నుంచి కూడా ముందుకు వచ్చి దాన్ని ఇక్కడ ఉన్న షెల్టర్ ని ఇప్పుడే ఇమ్మీడియట్ గా ఒక వారం లోనే పూర్తి చేసే భాద్యత వాళ్ళు తీసుకున్నారు. దానికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు. వీరందరినీ కూడా ఒకే చోటకి తీసుకెళ్లే విధంగా, వీరందరికీ అంతవరకు టెంపరరీ అకామడేషన్ ఇక్కడే ఇచ్చే విధంగా సరియైన పూర్తి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎంపీ అన్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, సామాన్లను ఎంపీ హరీష్ బాలయోగి చేతుల మీదుగా అందజేశారు.
