పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష కు మండపేట లో కేంద్రం...

 


ప్రభుత్వ  ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్ పరీక్ష పాలిసెట్-2026 కు మండపేట ను పరీక్ష కేంద్రం గా ఎంపిక చేసినట్లు అనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ జి.వి.వి.ఎల్.సత్యనారాయణ, సెంటర్ కో ఆర్డినేటర్ , మెకానికల్ ఇంజనీరింగ్ శాఖాధిపతి డి.వి.యస్.యస్. ఎన్.వి. 

ప్రసాద్ బాబు లు తెలిపారు. మండపేట ఏడిద రోడ్ లోని శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.ఏప్రిల్ 25  ఉదయం 11.00 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష  ఉంటుంది. పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.