ఏనుగుల మహల్ సబ్ స్టేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..


 ఏనుగుల మహల్ సబ్ స్టేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి ప్రభుత్వంలో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.కొత్తపేట శివారు ఏనుగుల మహల్ లో రూ.3కోట్లతో నిర్మిస్తున్న సబ్ స్టేషన్ పనులను ఆదివారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేసి సబ్ స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పాలూరి సత్యానందం, కంఠంశెట్టి శ్రీనివాస్, ధరణాల రామకృష్ణ, ముద్రగడ సుబ్బారావు మరియు తదితరులు పాల్గొన్నారు.