ప్రజలందరిపై పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి.కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

 .



కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.జగత్తుకే ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆకాంక్ష వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం ఆయన వసంతవాడ శ్రీ పార్వతి పరమేశ్వరస్వామి వారిని మరియు ఊబలంక శ్రీ ఉమాలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.