​జిల్లా పోలీస్ కార్యాలయం, డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం.

 


జిల్లా పోలీస్ కార్యాలయం,

డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,

అమలాపురం.

​బాధితుల సమస్యలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యం: జిల్లా ఎస్.పి శ్రీ రాహుల్ మీనా, ఐ.పి.ఎస్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా, ఈరోజు (సోమవారం) జిల్లా పోలీస్ కార్యాలయం (DPO) నందు "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (PGRS) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ రాహుల్ మీనా, ఐ.పి.ఎస్ గారు, జిల్లా అడిషనల్ ఎస్.పి శ్రీ ఏ.వి.ఆర్.పి.బి ప్రసాద్ గారితో కలిసి పాల్గొన్నారు.

👉​అర్జీల స్వీకరణ: జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఎస్.పి గారి దృష్టికి తీసుకువచ్చారు. ఎస్.పి శ్రీ రాహుల్ మీనా  ఐ పి ఎస్ గారు ప్రతి అర్జీదారునితో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను సానుకూలంగా, క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.

👉​ప్రధాన సమస్యలు: ఈ కార్యక్రమంలో 31 ఫిర్యాదులు వచ్చాయి.ప్రధానంగా భూ తగాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు మరియు సివిల్ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.

👉​అధికారులకు ఆదేశాలు: స్వీకరించిన ఫిర్యాదులను తక్షణమే సంబంధిత పోలీస్ స్టేషన్లకు సిఫార్సు చేశారు. బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. చట్టపరిధిలో బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని, పెండింగ్ లో ఉన్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.

👉​భరోసా: ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగించేలా, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా పరిష్కరిస్తామని ఎస్.పి గారు బాధితులకు భరోసా కల్పించారు.

​ఈ కార్యక్రమంలో ఎస్.పి శ్రీ రాహుల్ మీనా ఐ పి ఎస్ , అడిషనల్ ఎస్.పి  శ్రీ ఏ వి ఆర్ పి బి ప్రసాద్ గార్లతో పాటు పోలీస్ కార్యాలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.