కూటమి ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రోత్సాహం...
మన ప్రాంతంలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు జరగడం శుభపరిణామం...
అరిగెల శ్రీ రంగయ్య ఆల్ ఇండియా మెన్ అండ్ ఉమెన్ డే అండ్ నైట్ వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...
కూటమి ప్రభుత్వంలో క్రీడలకు, క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లభిస్తుందని, క్రీడలకు ఎల్లలు లేవని అంతర్జాతీయ స్థాయిలో మన గొప్పతనాన్ని చాటిచెప్పే శక్తి క్రీడలకు మాత్రమే ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అందుకు సాక్ష్యం అమలాపురం నుంచి వెళ్లిన రంకిరెడ్డి సాత్విక్ అన్నారు. గొల్లవిల్లిలో ఆదివారం అరిగెల శ్రీరంగయ్య ఆల్ ఇండియా మెన్ అండ్ ఉమెన్ డే అండ్ నైట్ వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవం కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ రెడ్డి అనంతకుమారి తదితరులతో కల్సి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనాడు పది జాతీయ స్థాయి టీములు ఈ పోటీల్లో పాల్గొనడానికి గొల్లవిల్లికి వచ్చాయని, గత మూడు దశాబ్ధాలుగా ఈ పోటీలు జరుగుతున్నాయని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఈ కార్యక్రమాలు బాగా జరుగుతాయని అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యంగా, ఆర్థికంగా, సంతోషంగా ఉండే సమాజం ఉండాలని కోరుకుంటున్నారన్నారు. అందుకు తగినట్లుగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈమధ్యే అమలాపురం శాసన సభ్యులు ఆధ్వర్యంలో ఎస్ యానాంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయన్నారు. ఆత్రేయపురం ఉత్సవం పేరిట డ్రాగన్ పడవల పోటీలు ఏర్పాటుచేస్తే అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. కోనసీమ గొప్పదనాన్ని చాటి చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.
