మోడేకుర్రు అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...


 మోడేకుర్రు అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...


కొత్తపేట మండలం మోడేకుర్రులో ముత్యాలమ్మ గుడి వీధిలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల పక్కనే ఉన్న తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాద ఘటనలో సర్వం కోల్పోయిన మోకా నాగలక్ష్మి, లేళ్ళ దుర్గాప్రసాద్, లేళ్ల రామకృష్ణ, యాళ్ల నాగులను ఆయన పరామర్శించి బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరపున అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు.ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు బాధితులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.