హృదయాన్ని కదిలించిన సంఘటన ఇది.
సాధారణంగా స్నేహం అంటే కాసేపు కాలక్షేపం కోసం అంతే ఈరోజుల్లో అదేగా ఎక్కువగా జరుగుతున్నది. అవసరం కోసం అవకాశం కోసం కానీ ఈ పసి హృదయాల్లో స్నేహం అంటే ప్రాణం ఎంతలా అంటే ఇది చదవాల్సిందే.
ఆ పిల్లాడికి సీటీ స్కాన్ చాలా ముఖ్యం కానీ ఆ పిల్లవాడు భయపడుతున్నాడు, వెళ్లనని మోరాయిస్తున్నాడు, కన్నవాళ్లు ఎంతగానో బ్రతిమిలాడుతున్నారు, వైద్యులు అర్థం అయ్యేలా చెబుతున్నారు కానీ వినట్లేదంటా. ఆ టైంలో నేను నీతో ఉంటాను అని ఒక మాట వినిపించింది ఆ పిల్లాడికి, అతని స్నేహితుడంట, నేను నీకు తోడుగా ఆ మెషిన్ లోకి వస్తాను అన్నాడంటా, అలాగే అతడిని పట్టుకుని ఆ మెషిన్ లోపలకు వెళ్ళాడు. ఆ స్నేహితుడి స్పర్శ చాలు కొండంత ధైర్యం వచ్చింది ఆ పిల్లాడికి. కష్టంలో నేను ఉన్నా అంటూ నిలుచున్నాడు, ఆడుకోవడానికి తోడుగా ఉంటూ అండగాను వచ్చాడు. ఇటువంటి స్నేహం పసిప్రాయంలో కనిపిస్తుంది చాలా వరకు, నేడు మాత్రం స్నేహం పేరుతో మోసాలు కనిపిస్తున్నాయి కానీ ఇలా చాలా అరుదు ఇలాంటి స్నేహితులు ఉన్నవాళ్ళు ఎవరైన సరే గొప్పవాళ్ళు అదృష్టవంతులు అంతే!!
