జియాలజిస్ట్ లు నేరుగా వచ్చి ఐదు పాయింట్లు పెట్టినా సరే నీళ్లు పడకపోవడంతో ఆశ్చర్యపోతున్న జియాలజిస్ట్లు


 ఫాతిమాపురం గ్రామంలో రాబోయే తరానికి తాగటానికి మంచినీరు కూడా దొరికే పరిస్థితి కనబడటం లేదు....

ఇటీవల కాలంలో ఫాతిమాపురం గ్రామంలో మంచినీటి కోసం మూడు బోర్లు వేసిన నీరు పడని పరిస్థితి.

గత కొద్ది నెల రోజులుగా ఫాతిమాపురం చెక్ పోస్ట్ దగ్గరలో సుమారుగా 5 బోరులు వేసిన మంచినీళ్లు పడని పరిస్థితి.

ఫారెస్ట్ అధికారులు నీటి కోసం బోరు వేసిన చుక్క నీరు పడటం లేదు.

దీనంతటికీ కారణం దగ్గరలో ఉన్నటువంటి బాలాజీ మెటల్ క్వారీయే కారణమని చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

జియాలజిస్ట్ లు నేరుగా వచ్చి ఐదు పాయింట్లు పెట్టినా సరే నీళ్లు పడకపోవడంతో ఆశ్చర్యపోతున్న జియాలజిస్ట్లు.

ఇక రాబోయే రోజుల్లో ఎక్కడ బోరు వేసినా నీరు పడకపోవచ్చు అని జియాలజిస్ట్లు అంచనా వేస్తున్నట్టు సమాచారం.

దీనంతటికీ ప్రధాన కారణం బాలాజీ మెటల్ క్వారీ లో మీటర్ల కొద్దీ తవ్వకాలు చేపట్టడంతో ఈ పరిస్థితి సంభవించినట్టు అధికారులు అంచనా వేస్తున్నట్టు సమాచారం.