గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువజన నాయకులు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు క్రీడారంగానికి, యువతకు పెద్దపీట వేస్తున్నారు

 గొల్లవిల్లిలో క్రీడా కోలాహలం.. జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు గారు


ఉప్పలగుప్తం మండలం, గొల్లవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 'అరిగెల శ్రీ రంగయ్య మెమోరియల్' జాతీయ స్థాయి మెన్ అండ్ ఉమెన్ వాలీబాల్ టోర్నమెంట్‌ను నేడు గౌరవ అమలాపురం ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారు ఘనంగా ప్రారంభించారు.



ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని ఇస్తాయి. జాతీయ స్థాయి పోటీలను మన గొల్లవెల్లిలో నిర్వహించడం గర్వకారణం.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువజన నాయకులు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు క్రీడారంగానికి, యువతకు పెద్దపీట వేస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రీడల ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని ఎప్పుడూ చెబుతుంటారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న పురుష మరియు మహిళా క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి, ఉన్నత స్థాయికి ఎదగాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడా నిర్వాహకులు మరియు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు