పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్
🔸“సంక్షేమం–అభివృద్ధి సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్న బడ్జెట్” అని మీడియా ముఖంగా తెలియజేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ ..
🔸గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం రంగాలకు ప్రాధాన్యం – రాష్ట్ర బడ్జెట్‌పై ఎమ్మెల్యే ఎంజీఆర్ విశ్లేషణ...
🔸కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యం… అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబాటు – ఎమ్మెల్యే ఎంజీఆర్ వ్యాఖ్యలు...
🔸పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు వారి కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026–27పై గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమం మరియు అభివృద్ధికి సమతుల్య ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు.గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన తదితర రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ద్వారా సమగ్ర అభివృద్ధికి బాటలు వేసిందన్నారు.బడ్జెట్‌లో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు కొనసాగింపుతో పాటు కొత్త పథకాలకు కూడా నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. ఆరోగ్య రంగానికి భారీ కేటాయింపులు చేయడం ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.అదేవిధంగా మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, సాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం రంగాల్లో నిధులు పెంపు చేయడం రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తుందని వివరించారు.రాష్ట్ర వృద్ధిరేటు పెంపు, ఆర్థిక స్థిరీకరణకు అనుగుణంగా సమగ్ర బడ్జెట్ రూపొందించబడిందని తెలిపారు.పేద, మధ్య తరగతి, రైతు, కార్మిక వర్గాల అభ్యున్నతే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని, విజన్ 2047 దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బడ్జెట్ ఇదని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పిటిసి, పిఎసిఎస్ అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు, ప్రధానకార్యదర్శులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.
