మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో గండి స్వామి భేటీ
అమలాపురం సిటిజన్ టైమ్స్ ఫిబ్రవరి 16; నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు గండి స్వామి హైదరాబాద్‌లోని జనసేన నాయకులు,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నివాసాన్ని మర్యాదపూర్వకంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, స్మారక కానుకను అందజేశారు.
ఈ భేటీలో ప్రజాసేవ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరగగా, బాలినేని ప్రజల పట్ల చూపుతున్న అంకితభావం, నిబద్ధతను గండి స్వామి ప్రశంసించారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయాలంటూ బాలినేని ప్రేరణాత్మక సూచనలు చేశారు.
