మానవత్వంతో సర్పంచ్ రాము ముందుకు వచ్చారు...
కిడ్నీ బాధితునికి ఆర్థిక సాయం చేశారు....
అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి గ్రామం కంభంపాడుకు చెందిన కిడ్నీ బాధితుడు కర్రి శ్రీనివాసరావుకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేసేందుకు గున్నేపల్లి అగ్రహారం గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి రామచంద్రరావు(రాము) మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. కిడ్నీ బాధితుడు శ్రీనివాసరావుకు రూ 10వేలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాము మాట్లాడుతూ ఆర్థిక సహాయం కోసం బాధితుడు శ్రీనివాసరావు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును సంప్రదించగా విషయం తెలుసుకున్న తాను బాధితునికి రూ.10వేలు ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. కిడ్నీ బాధితునికి ఆర్థిక సాయం చేసిన గ్రామ సర్పంచ్ రామును పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పేరాబత్తుల నాగభూషణం, విత్తనాల ప్రసాద్, కాండ్రేగుల సత్యనారాయణ, చొల్లంగి సాయిబాబు, పెద్దిరెడ్డి రామకృష్ణ, పెచ్చెట్టి తాతారావు, కొడమంచిలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
