అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు

 


అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు 

 నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయలు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు 

 ఎమ్మెల్యే పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్న ప్రజలు

కొత్తపేట : ఫిబ్రవరి 10 

కొత్తపేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అభివృద్ధిపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అభివృద్ధి ద్వేయంగా ఎమ్మెల్యే సత్యానందరావు పనిచేస్తున్నారని కొత్తపేట మండల టిడిపి నాయకులు తెలిపారు నేడు కొత్తపేట మండలంలో సుమారు 5 కోట్ల 37 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనతి కాలంలో  ఇంతటి భారీ స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బండారు సత్యానందరావుకే దక్కుతుందన్నారుఅభివృద్ధి పనుల్లో భాగంగా కొత్తపేట మండలంలోని పలు గ్రామాలలో శంకుస్థాపనలు చేస్తూ  కూటమి నాయకులతో  శరవేగంగాఎమ్మెల్యే సత్యానందరావు ముందుకు కదిలారు వారితో పాటు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ముందుగా కొత్తపేట శివారు బండారుపేట, కొత్తపేట, మందపల్లి, పలివెల, గంటి  బిళ్ళకూరు, వానపల్లి గ్రామాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా ఆవిడి గ్రామంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన విరామ సమయంలో నాయకులు సమావేశం నిర్వహించారునియోజకవర్గ అభివృద్ధి కొరకు అహర్నిస్టులు పాటుపడుతున్న ఎమ్మెల్యే సత్యానందరావును సమావేశంలో ప్రశంసించారుసీనియర్ నాయకుడుగా నాలుగుసార్లు  ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారుఆయనతో కలిసి పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నామని నాయకులు తెలిపారు.

పూలమాలలు శాలువలు తీసుకురావద్దని ఎమ్మెల్యే సత్యానందరావు ముందుగానే తెలియజేసినప్పటికీ ఆయన మీద ఉన్న అభిమానంతో గ్రామాలలో పూలమాలలు శాలువాలుతో సత్కరిస్తూనే వచ్చారు. పూలబాటపై నడిపించారు.అభివృద్ధి అంటే సత్యానందరావు సత్యానందరావు అంటేనే అభివృద్ధి అన్నట్టుగా నియోజవర్గంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని నాయకులు తెలియజేశారుఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.