కొత్తపేట నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు నూతన కార్యవర్గ ఎన్నిక


 కొత్తపేట నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు 

- నూతన కార్యవర్గ ఎన్నిక 

కొత్తపేట, ఫిబ్రవరి 10 : అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నూతనంగా ఏర్పాటైంది. కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రావులపాలెం సి.ఆర్.సిలో సమావేశమై కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కార్యవర్గంలో గౌరవాధ్యక్షులుగా దారపురెడ్డి సాయి (N tv), సలహాదారులుగా దత్తు బండి( R tv) , పెరవలి వెంకటేశ్వరరావు (Jilla Vaani) లను ఎన్నుకున్నారు

అధ్యక్షులుగా

దారపురెడ్డి సత్యనారాయణ (ABN),

ఉపాధ్యక్షులుగా

 రాయుడు జయదేవ్ (Big tv)

కార్యదర్శిగా

 వరసాల శ్రీను (Ap local Tv) 

కోశాధికారిగా

 దాసరి సత్తిబాబు (6 Tv),


సంయుక్త కార్యదర్శిగా

 నామాడి శివాజీ (99 Tv)

లను ఎన్నుకున్నారు.

అలాగే  సభ్యులుగాజి.వి.రాజు (SLT), కె.ఆనంద్ (1 Tv), రవిప్రదీప్ (I News), ఐ.విక్రమ్ రావు (Mega 9 News), యు.వెంకటేశ్వరరావు India Today), వై.బంగార్రాజు ( Andhra News), బి.సాయి( Image News)లను ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యత, పరస్పర సహకారం, వృత్తి పరిరక్షణ లక్ష్యాలతో ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలు, వృత్తి గౌరవాన్ని కాపాడటానికి కార్యవర్గం కృషి చేస్తుందని తెలిపారు.