కేవీబీ పురం మండలం, ఎస్.ఎన్.కండ్రిగ
ఆదర్శ ప్రాథమిక పాఠశాల . తిరుపతి జిల్లా:
-ప్రభుత్వ పాఠశాల అంటే కేవలం మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలే కాదు.. గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఒకటైతే నాణ్యమైన విద్య, పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించవచ్చని నిరూపిస్తోంది తిరుపతి జిల్లాలోని MPPS, ఎస్.ఎన్. కండ్రిగ మండలం ఎస్.ఎన్.కండ్రిగ ఆదర్శ ప్రాథమిక పాఠశాల. నాయకత్వమే మార్పుకు నాంది..
ఈ పాఠశాల ప్రగతి వెనుక ఒక నిబద్ధత కలిగిన నాయకత్వం ఉంది.ఉన్నత విద్యావంతుడు,నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే తపన ఉన్న ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ భాస్కర్ వేడియం జూన్ 2025లో ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సహచర ఉపాధ్యాయులు, గ్రామ ప్రజల సహకారం తో ఈ పాఠశాల అభివృద్ధి పరుగులు తీస్తోంది ఆయన అదే గ్రామంలో ఉంటూ, ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకే పాఠశాలకు చేరుకుంటున్నారు. పాఠశాల పనివేళలు ముగిసినా, మరో గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కేవలం బడిలోనే కాకుండా, రాత్రివేళల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారు చదువుతున్నారా లేదా అని గమనిస్తుండటం విశేషం. విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు శిథిలావస్థ నుండి శిఖరాల వైపు..
ఒకప్పుడు పాత భవనంతో ఇబ్బంది పడిన ఈ పాఠశాల, నేడు మరమ్మత్తులు పూర్తి చేసుకుని సరికొత్త శోభను సంతరించుకుంది. గ్రామస్తుల సహకారంతో పాఠశాల పక్కన ఉన్న మేకల షెడ్డును తొలగించి, ప్రాంగణాన్ని శుభ్రంగా మార్చారు. భౌతిక వనరులతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇక్కడ పెద్దపీట వేస్తున్నారు నైపుణ్యాల శిక్షణ: విద్యార్థుల చేతిరాతను మెరుగుపరిచేందుకు ప్రత్యేక హ్యాండ్‌రైటింగ్ శిక్షణ ఆరోగ్యమే మహాభాగ్యం 'ఫ్రూట్స్ అండ్ నట్స్ డే' ద్వారా పోషకాహార అవగాహన, శ్రీ నారాయణ గోసేవ ట్రస్ట్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాలుపర్యావరణ స్పృహ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ, కాలుష్య రహిత దీపావళి వేడుకలు దాతృత్వానికి నిలయం..
పాఠశాల అభివృద్ధిలో దాతల పాత్ర అమోఘం. పూర్వ విద్యార్థి A. శ్రీనివాసులు అందించిన ప్రింటర్, డాక్టర్ భాస్కర్ వేడియం స్వయంగా అందించిన ₹50,000 వారి మిత్రుల ద్వారా ₹25000 రూపాయలు మొత్తం ₹ 75000 రూపాయల విలువైన ఆట వస్తువులు విద్యార్థులకు వరంగా మారాయి. అన్నింటికంటే ముఖ్యంగా, పాఠశాల భవిష్యత్తు అవసరాల కోసం గ్రామస్తులు సమిష్టిగా సుమారు ఒక ఎకరం స్థలాన్ని సేకరించి ఇవ్వడం ఆ ఊరి ప్రజలకు చదువుపై ఉన్న మక్కువకు నిదర్శనం.ప్రత్యేక గుర్తింపు - పురస్కారాలు విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించిన 5 మంది మహిళా ఉపాధ్యాయులు, అధ్యాపకులు మరియు ఆచార్యులను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలతో సన్మానించడం పాఠశాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ప్రైవేట్ నుండి ప్రభుత్వ బడికి.. పాఠశాలలో జరుగుతున్న ఈ విప్లవాత్మక మార్పులు చూసి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులపై నమ్మకం పెరిగింది. ఫలితంగా, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 36వచ్చే విద్యా సంవత్సరం ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న16 మంది పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించడానికి విద్యార్థి తల్లిదండ్రులు అంగీకరించారు. అంతే కాకుండా ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న మరో 15 మంది విద్యార్థులను కూడా ఇక్కడికి రప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇది ఉపాధ్యాయుల బోధనా పటిమకు, నిబద్ధతకు దక్కిన అసలైన విజయం రాష్ట్రానికే ఓ దిక్సూచి..
S.N. కండ్రిగ పాఠశాల నేడు ఒక మోడల్ స్కూల్‌గా నిలిచింది. ఇక్కడ జరిగిన అభివృద్ధి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ జరిగితే, ప్రతి బడి ఒక అక్షర దేవాలయంగా మారుతుంది. ఏ ఒక్క విద్యార్థి కూడా పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యం నెరవేరుతుంది."గ్రామస్తులు, ఉపాధ్యాయులు చేతులు కలిపితే మన ప్రభుత్వ బడులు కార్పొరేట్ సంస్థలను మించిపోతాయి" అని ఈ పాఠశాల అనుభవం చాటిచెబుతోంది. ఆ గ్రామ ప్రజల సందేశం "బడి బాగుంటేనే ఊరు బాగుంటుంది.. ఊరు మేల్కొంటేనే చదువు వెలుగుతుంది! ప్రభుత్వం, ప్రజలు, ఉపాధ్యాయులు - ఈ ముగ్గురూ చేతులు కలిపితే అసాధ్యం అనేది ఏదీ లేదు. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. రండి, మన బడిని మనమే కాపాడుకుందాం!"
