డోన్ పట్టణంలోని కొత్తపేట హై స్కూల్ నందు విద్యార్థులకు ఆరోగ్యం,వాతావరణ కాలుష్యం పై అవగాహణ సదస్సు *విద్యార్థులు ప్రతిఒక్కరు

 




మొక్కలు నాటి మహావృక్షాలుగా చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి*

స్వాతంత్ర్యసమరయోధులు  శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి సేవలు చిరస్మరణీయం

సామాజిక కార్యకర్త  డోన్  

*డోన్ కొత్తపేట హైస్కూల్ హెచ్ ఎం ఎన్. రామ నర్సప్ప , బి. చంద్రుడు, 

ఫిబ్రవరి 27 న స్వాతంత్ర్యసమరయోధులు  శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి సందర్బంగా

డోన్ పట్టణం లోని కొత్తపేట హైస్కూల్  నందు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యంలో  డోన్ కొత్తపేట హైస్కూల్ హెచ్ ఎం ఎన్. రామ నర్సప్ప, బి. చంద్రుడు  అద్యక్షతన స్వాతంత్ర్య సమరయోధుడు  శ్రీ  చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్దంతి  సందర్బంగా వారి చిత్ర పటానికి 

పూలమాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించి వారిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.లోకనాథ్ రెడ్డి , సి.శ్రీనివాసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా  స్కూల్ హెచ్ ఎం ఎన్. రామ నర్సప్ప, బి.చంద్రుడు, ఉపాద్యాయులు పి. లోకనాథ్ రెడ్డి ,సి. శ్రీనివాసులు,సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ

మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి  కోరారు

శ్రీ  చంద్రశేఖర్ ఆజాద్ 1906 జూలై 23  ఉత్తరప్రదేశ్ లో  జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శ్రీ సీతారాం తివారీ, శ్రీమతి  జగరాణిదేవి. చంద్రశేఖర్‌ ఆజాద్‌ పేదరికంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుండె ధైర్యసాహసాలు చూపేవారు. ప్రజల నుంచి మహాత్మాగాంధీజీ వరకు నీరాజనాలు అందుకున్న మహావీరుడు.1921లో గాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చినప్పుడు చంద్రశేఖర్‌ కూడా జనంతో కలిసి వందేమాతరం,  అంటూ నినాదాలు చేశారు. బ్రిటిష్ దురాక్రమణకు వ్యతిరేకంగా ఎదిరించిన మన  భారతీయ స్వాతంత్య్ర సమర యోధుడు  చంద్రశేఖర్‌ అజాద్. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ ,రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లాఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకడు చంద్రశేఖర్ అజాద్. షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా బ్రిటీష్  వారిని  ఎదిరించాడు.శత్రువుల చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకుని   ఫిబ్రవరి 27, 1931  అమరుడై అమరవీరునిగా  భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైనారు. ఇలాంటి మహానుభావులను అనుక్షణం స్మరించుకుంటూ  గుర్తుచేసుకొని వారి  ఆశయాల సాధనలో భాగస్వాములు కావాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి, డోన్ కొత్తపేట హైస్కూల్ హెచ్ ఎం ఎన్. రామ నర్సప్ప ,బి. చంద్రుడు కోరారు.

అలాగే సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి విద్యార్థులకు పలు ఆంశాల పై   అవగాహణ కలిగించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి. పరిసరాలను  పరిశుభ్రంగా  ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా  దోమకాటు  నుంచి వచ్చేవిష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై  గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి.  వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ నిరోధించాలి. ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలి. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ - ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ  పోలియో చుక్కలు ఖచ్చితంగా వేయించాలి. క్రమం తప్పకుండా  సరైన సమయానికి టీకాలు వేయించాలి. చిన్నప్పుడు నుంచే పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త  డోన్  పి. మహమ్మద్ రఫి తెలిపారు.  ప్రస్తుత ఆధునిక యుగంలో ఇంట్లో చేసే ఆహార పదార్థాలకంటే.. బయటదొరికే ఫాస్ట్ ఫుడ్స్‌ ఆహారం  ఎక్కువగా తింటున్నాము. అయితే వాటిని భద్రపరిచే  పేపర్స్  వ్రాపర్స్‌తో  ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. అలానే ఈ ఫాస్ట్ ఫుడ్స్ భద్రపరిచే కవర్లు, ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువుల్లోని రసాయనాలు మనం తీసుకునే ఆహారం  ద్వారా  జీర్ణాశయంలో చేరి అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నాయని ఇటీవలే  సర్వేల ద్వారా తెలియజేశారని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. కల్తీ ఆహర పదార్థాల పై అవగాహణ కల్గి ఉండాలి. కల్తీ నివారణలో , కాలుష్య నివారణలోను సామాజికంగా ప్రతి ఒక్కరు భాగస్వాములై కల్తీ ఆహారపదార్థాలను నివారించుకుని ,కాలుష్యం లేని గాలి (ఆక్సిజన్ ) తో మన  ఆరోగ్యాలను  కాపాడుకోవాలని  సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. ఆహారాన్ని వృధా చేయకుండ  మన సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేసుకుని ఆరోగ్యాలను

కాపాడుకోవాలని  సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ  పాటించాలి. తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలి. మన దేశాన్ని మన సంస్కృతి సంప్రదాయాలను, మన పూర్వీకులను ప్రేమించాలి. మూఢనమ్మకాలపై నిరంతరం అవగాహనతో ఉండాలి. ఇప్పటికీ అనేక గ్రామాల్లో పట్టణాల్లో వ్యాధులతో బాధపడుతున్నటువంటి పేషెంట్లు స్వామీజీలు మంత్రాలు తంత్రాలు అంటూ తిరుగుతూ వ్యాధి తీవ్రతను ఎక్కువ చేసుకుంటున్నారు. వారిని అవగాహనతో వైద్యశాలకు తరలించే విధంగా చైతన్య పరచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు. మన మీద మనకు నమ్మకం ఉంచుకోవాలి. పేదల పట్ల, నిరక్షరాశ్యుల పట్ల, రోగుల పట్ల సేవా భావం కలిగి ఉండాలని తెలిపారు. స్మార్ట్‌ ఫోన్‌ ఎక్కువ వాడకుడదని తెలిపారు. ఎక్కువగా వాడటం ద్వారా జ్ఞాపకశక్తి తగ్గడం, అసహనం, చిరాకు లాంటి  పలు రకాల సమస్యలతో పాటు అది వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారని  సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. మరణించిన తర్వాత నేత్రదానం, బ్రెయిన్ డెడ్ ,యాక్సిడెంటు  అయినటువంటి కేసులలో అవయవాల దానం చెయ్యవచ్చు. ప్రస్తుత సమాజంలో అవయవదానం అవసరం చాలా ఎక్కువ అగుచున్న తరుణంలో  ప్రజల్లో విశృత స్థాయిలో అవగాహణ అవసరమని సామాజిక కార్యకర్త  డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు. ప్రపంచంలోనే  అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశం. ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. కొన్న వ‌స్తువుకు బిల్లు తీసుకోవాల‌ని, ఐఎస్ఐ మార్క్ క‌లిగిన వ‌స్తువుల‌ను ఎంపిక చేసుకోవాల‌ని, తూనిక‌లు, కొల‌త‌ల విష‌యంలో కూడా జాగ్ర‌త్త వ‌హించాల‌ని, వ‌స్తు సేవ‌ల్ని పొందేట‌ప్పుడు ఏవైనా ఇబ్బందులు ఎదురైన‌ప్పుడు వినియోగ‌దారుల ఫోర‌మ్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా న‌ష్ట‌ప‌రిహారం పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు. నిజ జీవితంలో ఇటువంటి ముఖ్య‌మైన అంశాల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌డంతో పాటు మ‌న చుట్టూ ఉన్న‌వారిని కూడా చైత‌న్య‌వంతులుగా చేయ‌డం  సామాజికంగా  ప్రతి ఒక్కరి బాధ్య‌త‌గా గుర్తించాల‌ని సామాజిక  కార్యకర్త  డోన్  పి.మహమ్మద్ రఫి  తెలిపారు. లింగ నిర్ధారణ నివారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.  ప్రస్తుత సమాజంలో బాలికల సంఖ్య తగ్గుతున్నది. మహిళా నిష్పత్తి  తగ్గటం వల్ల ప్రమాదకర భవిష్యత్‌ను సూచిస్తుందని   లింగపరంగా అసమతుల్య స్థితి ఉంటే సమాజంలో అనేక ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉందని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు.  ఆడ మగ ఇద్దరూ సమానమేనని, లింగ వివక్ష చూపడం నేరమేనని తెలియజేశారు. ఆడబిడ్డలను  పుట్ట నిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం  అలాగే బాల్య వివాహాలు చేయకూడదని తెలియజేశారు. పిల్లలతో పని చేయించడం చట్టరిత్య నేరం. పిల్లలను బడిలో  చేర్పించాలి. బాలలను బడిలో చేర్పించకుంటే దేశం అంధకారానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారని ఎవరైనా బాల కార్మికులను గుర్తిస్తే వెంటనే 1098 చైల్డ్ లైన్‌ కేంద్రానికి సమాచారం అందించాలని సామాజిక కార్యకర్త  డోన్  పి.మహమ్మద్ రఫి తెలిపారు.మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా జీవించాలని సామాజిక కార్యకర్త  డోన్  పి. మహమ్మద్ రఫి తెలిపారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని  వైద్యనిపుణులను సంప్రదించకుండా నొప్పులు మాత్రలు వాడరాదు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని,నీళ్ళు శరీరానికి తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని  సామాజిక కార్యకర్త  డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.

మీ