లోకేష్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు....


నారా లోకేష్ జిల్లాలు, పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే ల కుటుంబాలతో ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలోఅమలాపురం పార్లమెంట్ పరిధి ప్రజా ప్రతినిధులతో యువనేత  నారా లోకేష్  ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు  తన కుటుంబ సభ్యులతో కలసి ఆత్మీయ సదస్సు లో పాల్గొన్నారు. ఉండవల్లి  లోని నారా లోకేష్  నివాసంలో ఆత్మీయ సమావేశం చాలా ఆహ్లాదకర వాతావరణం లో సాగింది. ఈ కార్యక్రమంలో లోకేష్  ప్రజా ప్రతినిధులతోనూ వారి కుటుంబ సభ్యులతోనూ ఎంతో సరదాగా మాట్లాడుతూ పేరుపేరునా వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్  ఎమ్మెల్యే వేగుళ్ళతోను, వేగుళ్ళ పెద్ద కుమార్తె మణిమంజరి, అల్లుడు సురేష్ కుమార్ లతో కొద్దిసేపు ముచ్చటించారు.