రాజమండ్రి ..
********
ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక మానసిక రోగి .
హిందూ పదాన్ని వక్రీకరించిన ఉదేశ్యం వెనుక కుట్ర కోణం వుంది.
మత కలహాలు సృష్టించటమే ఆర్ ఎస్ ఎస్ రాజకీయ ఉద్దేశ్యం.
భారత్ లో మరో గోద్ర అల్లర్లకు ఆర్ ఎస్ ఎస్ కుట్ర చేస్తుందా !
********
మేడా శ్రీనివాస్ , అనుమానం వ్యక్త పరిచారు ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
*********
బ్రిటిష్ వాళ్లకు ఊడిగం చేసిన ఆర్ ఎస్ ఎస్ నేడు ముసుగు వేసుకున్న హిందూ ఉగ్రవాదం ను ప్రోత్సహిస్తుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ నేరుగా విమర్శించారు.
హిందూ పదంను వక్రీకరించి మాట్లాడుతున్న
ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అఖండ హిందూ సమాజానికి భాహిరంగ క్షమాపణ చెప్పాలి . ఒక శతాబ్ద కాలం పైభడి హిందూ ధర్మ రక్షకులుగా ముసుగు ధరించి హిందూ ధర్మాన్ని , భక్తులను పచ్చిగా మోసం చేస్తూనే వున్నారు . ఎంత హిందూ ముసుగు వేసుకున్నా లోనున్న హిందూ వ్యతిరేక స్వభావం మోహన్ భగవత్ నోటి నుండి వచ్చిందన్నారు . హిందూ ధర్మం యొక్క మూలాలు , పవిత్రత , ఆ శక్తి ఈ ముసుగు హిందూ ఆర్ ఎస్ ఎస్ వాళ్లకు తెలియదని మోహన్ భగవత్ మాటల ద్వారా నేడు ప్రపంచానికి అర్ధం అవుతుందన్నారు . మోహన్ భగవత్ పవిత్ర హిందూ పదంపై విషం కక్కిన ఘటనను ఆర్ ఎస్ ఎస్ గాని వాటి అనుబంధ సంస్థలు గాని నేటి వరకు ఖండించక పోవటాన్ని బట్టి వీరు హిందూ రక్షకులు కారు భక్షకులు అనే నిజం నేడు యావత్ మానవ సమాజానికి అర్ధం అవుతుందని ఆయన పేర్కొన్నారు ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ హిందూ పదాన్ని ఉద్దేశ్యపూర్వకమైన కుట్ర కోణం తోనే వక్రీకరించారు . హిందూ అనే ఒక పవిత్ర పదాన్ని అడ్డుపెట్టుకొని దశబ్దలుగా మోహన్ భగవత్ వంటి ఎందరికో ఒక చిరునామా దక్కిందాన్నారు . నేడు హిందూ పదాన్ని వక్రీకరిస్తు ప్రకటనలు చేయటం ఆర్ ఎస్ ఎస్ కే చెల్లిందన్నారు . మోహన్ భగవత్ చేసిన ప్రకటన కారణంగా కొంతమంది మత ఉన్మాద శక్తులు హిందూ పదాన్ని కామెంట్స్ చేస్తున్నారు . ఈ పరిస్థితులు మత ఘర్షణలు పెరగటానికి కారణం కావొచ్చన్నారు . ఇప్పటి వరకు మోహన్ భగవత్ చేసిన కామెంట్ ను ఆర్ ఎస్ ఎస్ వారు నేటి వరకు ఖండించ కుండా కాబోదులుగా మారరు .
ఆర్ ఎస్ ఎస్ వక్రబుద్దికి ఇది తర్కాణం అన్నారు . భారతదేశంలో ఆర్ ఎస్ ఎస్ మూలాలు హిందూ ధర్మానికి భద్రతకు పెను ప్రమాదంగా మరే పరిస్థితులు వున్నాయని , ఆర్ ఎస్ ఎస్ ను పూర్తిగా నిషేధించి మత సామరస్యానికి తోడ్పాటుగా నిలవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మోహన్ భగవత్ హిందూ పదంపై చేసిన విషపు మాట వెనుక మత కలహాలు ప్రేరేపించే గూడార్థం వుందన్నారు . ఒకప్పుడు హిందూ , ముస్లిమ్స్ మధ్య చిచ్చు పెట్టి మత కలహాలకు ఆజ్యం పోశారు . నేడు క్రిష్టియన్ , హిందూ ల మధ్య మత ఘర్షణలు ప్రేరేపించే విధంగా కుట్రలు చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . హిందూ ధర్మం ఎప్పుడు శత్రువు నుండి కాపాడుకోవటానికి మాత్రమే యుద్ధం చేస్తుంది . మోసం ఎప్పుడు చేయదు. హిందూ ధర్మం ఎప్పుడు ప్రాణం పోస్తుంది . మతం రంగు ఎప్పుడు ప్రాణం తీస్తుంది. అది ఏ మతమైనా అంతే నన్నారు . భారతదేశం ఒక లౌకిక దేశం మత పరమైన దేశం కాదు . కొంతమంది మతోన్మాదులు సెక్యులర్ హిందువులు అంటు హేళనగా మాట్లాడుతు మత వివాదాలకు అగ్గి రాజేస్తున్నారు . అఖండ భారతదేశంలో ప్రతి హిందువు ఒక సెక్యులర్ అని మరవకండి . సెక్యులర్ అంటే తన ధర్మాన్ని కాపాడుకునే వాడు , ఇతర మత విశ్వాసాలను గౌరవించే వారని అర్ధం . హిందువు అంటేనే రక్షకుడని , భగవంతుడు మెచ్చే వాడని అర్ధం అని ఆయన తెలిపారు ..
భారతదేశంలో యువత కొన్ని చారిత్రిక నిజాలను తెలుసుకునే సౌలభ్యం నేటి యువతరానికి అందుబాటులో వుంది . ఆర్ ఎస్ ఎస్ వాడు బ్రిటిష్ వారి కి ఊడిగం చేసి ఎందరో భారతీయ ఉద్యమ యోధుల మరణాలకు కారకులయ్యారు . వీరు ఎన్నడు స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదన్నారు . నాడు బ్రిటిష్ వారికోసం సేవలు చేసిన ఈ ఆర్ ఎస్ ఎస్ వారు దేశ భక్తులుగా ప్రచారం చేసుకోవటం దెయ్యాలు వేదాలు చెబుట్టున్నట్టుగా ఉంటుంది . మోహన్ భగవత్ హిందూ పదంపై చల్లిన కాలకూట విషం వెనుక ఒక రకమైన రాజకీయ కుట్ర దాగివుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . మరో గోద్ర వంటి అల్లర్లుకు ఆర్ ఎస్ ఎస్ పథక రచన చేస్తుందా ! అనే భయాలు భారతీయులను వెంటాడుతున్నాయని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవేదన వ్యక్త పరిచారు ఈ సభకు అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి , సిమ్మా దుర్గారావు , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , దుడ్డే త్రినాద్ , వాడపల్లి జ్యోతిష్ , గుడ్ల దుర్గా ప్రసాద్, వల్లి శ్రీనివాసరావు, యర్రా బాల మురళి కృష్ణ , బసా సోనియా , మేకల కిరణ్ కళ్యాణ్ , చల్లా సాంబశివరావు , మాసా అప్పాయమ్మ , చల్లా వంశీ , ఎస్ కే బాబీ తదితరులు పాల్గొనియున్నారు ..
